స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. పలాస ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం స్వచ్ఛ రథాలను ఆమె ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఎండిఓ వసంత కుమార్, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, విఠల్, చిన్ని, శ్రీనివాసరావు, కృష్ణారావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.