శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్ళవలస గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కూర్మాపు వరలక్ష్మి (30), తన ఇద్దరు కుమార్తెలు భవాని(3), చాందిని 4 నెలలు గొంతు కోసి, అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనా స్థలంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా... తల్లి రిమ్స్ ఆసుపత్రిలో కొనఊపిరితో పోరాడుతుంది. విషయం తెలుసుకున్న డి.ఎస్.పి ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన తల్లి మాట్లాడితే పూర్తి వివరాలు తెలుస్తాయని, ఆయన మీడియాతో వెల్లడించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.