నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక యువత చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ఏ దేశానికైనా ప్రధాన శక్తిగా మారి దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తారని, అటువంటి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సునీల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.