శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురంలో ప్రభుత్వ కాలువ, గోర్జి భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతుండగా తహశీల్దార్ శ్రీదేవి రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకపోవడంతో గురువారం రాత్రి పనులను నిలిపివేసి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.