పలాస మండలం బంటుకొత్తూరు పంచాయతీ పెద్ద నారాయణపురం గ్రామంలో పెద్ద చెరువు లో ఉపాధి హామీ పథకం పనులను తెలుగుదేశం నాయకులు నిమ్మన గోపాలరావు ప్రారంభించారు. మంగళవారం ఉదయమే భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గుంట హారతి, కార్యకర్తలు, ఉపాధి హామీ శ్రామికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.