రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అక్కుపల్లి జంక్షన్, కాశీబుగ్గ బస్టాండ్, నెహ్రూ పార్క్ ల వద్ద చలివేంద్రాలను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.