శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్ద కేసుపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు గురై తల్లి కూతురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడియా కృష్ణవేణి(35), తన కుమార్తె చిన్ని(15) కలిసి జీడీ తోటలో పనులు చేస్తుండగా... ఒకసారిగా పిడుగు పడటంతో తల్లి కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.