పలాస సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాజరు పట్టిని పరిశీలించి డ్యూటీలో ఉన్న డాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సమయపాలన పాటించి వచ్చిన రోగులకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఇటీవల పలువురు వైద్యులపై రోగుల నుంచి ఫిర్యాదులు అందాయని అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.