పలాస ఎంజెపి పాఠశాలలో చదివిన షర్మిలకు 591 మార్కులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రధానోపాధ్యాయులు చిన్నం నాయుడు, విద్యాధర్, డీఈవో రవిబాబు, ఉపాధ్యాయులు కిల్లి వెంకట్రావు, యతిరాజు, వేణుగోపాలరావు, తారక రామారావు, రవికాంత్, సుధాకర్, అప్పలరాజు లకు సన్మానించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.