ఆంధ్రప్రదేశ్ మహిళా బిల్లు - మహిళా సాధికారతకు చారిత్రాత్మకత అడుగు అంటూ.. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు మహిళలను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటుతో మహిళలకు సామాజిక రాజకీయ గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం టిడిపి ప్రభుత్వ నిదర్శనమని కొనియాడారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.