శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీ నగర్ లో చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో డి ఈ గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి సెలవు నిమిత్తం కుటుంబ కలిసి స్వగ్రామానికి వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 4,500 రూపాయలు నగదు ను దొంగలు దోషుకెళ్ళినట్లు కాశీబుగ్గ సిఐ రామకృష్ణ తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.