పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గంజాయి డిటెక్షన్ కిట్ తో ఆదివారం సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా వ్యక్తులు గంజాయిని సేవించినట్లయితే.. ఈ ప్రత్యేకమైన కిట్ ద్వారా ఘటన స్థలంలోనే పరీక్షించి తక్షణమే వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ గంజాయి డిటెక్షన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సిఐ రామకృష్ణ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ప్రతినిధి మురపాల కాళీప్రసాద్ మండల ప్రజల కోరిక మేరకు ఎంపీపీగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన పనులను పూర్తి చేశారు. ఈ పంచాయతీలో అభివృద్ధిని గమనించిన మండల ప్రజలు ఆయన పరిపాలన పంచాయతీ పరిధిలోకే పరిమితం కాకుండా.. మండల స్థాయిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎంపీపీగా అవకాశం కల్పించాలని కాళీప్రసాద్ కోరారు.