శ్రీకాకుళం జిల్లా పలాస కెటి రోడ్ లో ఉన్న ఓ మొబైల్ షాప్ లో పనిచేస్తున్న యువకుడు లోలుగు ఈశ్వరరావుపై ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై దాడి చేసి, చాకు గొంతు కోశారు. బాధితుడు ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా గురండి పంచాయితీ పరిధి అంకుడు గ్రామానికి చెందిన లోలుగు ఈశ్వరరావు యొక్క అన్న లోలుగు రమేష్ ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తెలుసుకున్న కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరరావు పలాసలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యుల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.