ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కాశీబుగ్గ కు చెందిన పూజారి కీర్తి పండా - 591(జడ్పీ హైస్కూల్ కాశీబుగ్గ), బి షర్మిల - 591 (ఎంజెపి పలాస) లను యూనివర్సిటీ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రెడిట్ బి సంస్థ సౌజన్యంతో నగదు పురస్కారాలు శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కీర్తి పండా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కిల్లి వెంకట్రావు సహకారంతో ఇంతటి విజయం సాధించగలిగామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.