పలాసలో ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం వర్చువల్ విధానంలో జరగనుందని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న టిడిపి క్యాడర్ ను సమన్వయం చేస్తూ... ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.