శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి శ్రీనివాసనగర్ 2వ వీధిలో తాళం వేసి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు హేమశంకర్ వేసవి సెలవులు కారణంగా శుక్రవారం నాడు ఇంటికి తాళం వేసి సొంత ఊరైన మందస వెళ్లడంతో శనివారం రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, రెండు కిలోల వెండితోపాటు రూ. 70 వేలు నగదు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నరసింహమూర్తి ఆధారాలు సేకరిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.