శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం పంచాయతీ పరిధి మెట్టపేట గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా మంజూరైన రూ. 39.60 లక్షల నిధులతో మంచినీటి పథకాన్ని ఆదివారం ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.