శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సుంకరి జగన్నాధపురం గ్రామానికి చెందిన గంగిట్ల యతీష్ గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 573 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు రామారావు, అరుణ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుమారుడికి స్థానికంగా ఉన్న పాత టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన యతీష్ మంచి మార్కులు తెచ్చుకొని మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు బాలుడిని అభినందించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.