శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలో శుక్రవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్దారులతో మాట్లాడుతూ.. ప్రతి నెల పెన్షన్ అందుతున్న తీరని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పిచ్చ పెన్షన్ను కూటమి ప్రభుత్వం పెంచి అందిస్తున్న తీరును వివరించారు. IVRS విధానంలో సెల్ఫోన్ ద్వారా ప్రభుత్వ సర్వేకు స్పందించాలని కోరారు. అనంతరం నీలావతి ROB ని సుమారు రూ. 60 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. కొబ్బరిచెట్లూరు, సుమ్మాదేవి, గ్రామాల కు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ పి టి పి సి చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్రావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో అప్పల్రాజు, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, డీఎస్పీ భవాని, సిఐ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కుత్తుం లక్ష్మణ్, లోడగల కామేశ్వరరావు, బడ్డా నాగరాజు, చిన్ని, సంతోష్ నాయుడు, సారా జోగారావు, కుత్తుం ప్రకాష్ రావు కూటమినాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.