ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు కాశీబుగ్గ సాయిబుల కాలనీలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నలుగురు సీఐలు, ఈగల్ టీం తో కలిపి సుమారు 60 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధిత సమాజం నిర్మించేందుకు సహకరించాలని స్థానికులచే ప్రతిజ్ఞ చేయించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.