శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడులో శుక్రవారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో మేలు జాతి లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ యొక్క లెగదూడలను ప్రదర్శనకు తీసుకొచ్చారు. పశు వైద్యులు పద్మావతి, పాపారావు, మధుబాబు ఆధ్వర్యంలో రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం లెగదూడల పెంపకంపై పలు సూచనలు, సలహాలు రైతులకు పశు వైద్యులు పాపారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మురిపింటి నారాయణ, రాపాక శాంతారావు, కోనారి గణపతి, అంబటి నారాయణ, కోనేరి వల్లభరావు, కొంచాడ మోహనరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.