బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.