శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (M) డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆదివారం బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులను పట్టుకున్నారు. సముద్రంలో చేపల వేట లేకున్నా ఒక పడవపై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను స్థానిక మత్స్యకారులు గమనించి, వెంటనే మరో పడవలో సముద్రంలోకి వెళ్లి వారిని పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో సమాధానం చెబుతుండడంతో... 8 మంది మత్స్యకారులను ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.