Skip to main content

apk ఫైల్ తో జాగ్రత్త సుమా...!

బిగ్ అలెర్ట్.... 

సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ కు Apk ఫైల్ ను పంపుతారు. Apk అని ఉండే ఏ ఫైల్స్ ని కూడా ఎటువంటి పరిస్థుతులలో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మీ ఫోన్ డేటా పోవడమే కాకుండా మీకు తెలియకుండా మీ ఫోన్ ను సైబర్ నేరస్తులు ఆపరేట్ చేస్తారు. మీ ఫోన్లో ఉన్న డాటా, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగిలించ బడతాయి జాగ్రత్త. 

ఉదాహరణకు :

RTO CHALLAN.apk
Aadhar.Apk
SBI.Apk
pm kisan.Apk
Unions Bank.Apk
Cse.Apk
Statebank.Apk
Ekyc apk

ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది. ఈ ఫైళ్లని డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా డిలీట్ చేయండి. ఏదైనా మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతా స్తంభింపజేయాలి. 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.

High Viewed News

లక్ష్మీపురం లో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటల నుండి టిడిపి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కావున కూటమి నేతలు, పలాస నియోజకవర్గం ప్రజలు గమనించగలరని టిడిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తవూరులో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

  ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM       CBN * TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు * AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్ * TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు * TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్కు తప్పుడు కేసులో నోటీసులు: KTR * BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక * భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు

పలాసలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

ఈనెల 25వ తేదీ నుంచి పలాస రైల్వే గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెటర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ATBPL ఒక ప్రాంతంలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనే జట్టులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు www.atbpl.in లేదా 7901233535 నెంబర్ కు సంప్రదించాలన్నారు.