శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం(M) డొంకూరు గ్రామానికి చెందిన బడే చంటి (22) అబుదాబి లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అబుదాబిలో వెల్డింగ్ పనులు చేస్తూ... చంటి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంపెనీ యాజమాని మృతుని కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తూ... తమ కుమారుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వ విప్ అశోక్ బాబు కు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు కోరారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.