శ్రీకాకుళం జిల్లా మందస(M) కొండలోగాం గ్రామంలో శనివారం నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చివరి భూములకు సాగు నీరు కూటమి ప్రభుత్వంలో అందించామని, మార్కెట్లో గిట్టుబాటు ధర ఉన్న పంటలను గిరిజనులు సాగు చేయాలని ఆమె కోరారు. కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జామ చేస్తుందని ఆమె తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.