Skip to main content

దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ పోరులో.. భారత్ గెలుపు

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థిపై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల వద్ద 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ (72), యాన్సన్(70), బాష్(67) కంగారు పెట్టినా.. గెలుపు భారత్ వశమైంది.

హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో రికెల్టన్(0), డికాక్(0) వెనువెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మార్క్రమ్(7) ఐదో ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అప్పటికే క్రీజులో ఉన్న మాథ్యూ.. డిజార్జి(39)తో కలిసి నాలుగో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 15వ ఓవర్లో డిజార్జి.. కుల్దీప్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రెవిస్ (37) 22వ ఓవర్లో హర్షిత్ వేసిన బంతిని సిక్స్ మలిచే క్రమంలో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన యాన్సన్ దూకుడుగా ఆడుతూ.. మాథ్యూకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. అయితే, 34వ ఓవర్లో కుల్దీప్ వీరిద్దరిని పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్రయెన్ 17 పరుగులకు ఔటయ్యాడు. చివర్లో బాష్ (67) పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్రణా 3, అర్ష్దీప్ 2, ప్రసిద్ధ ఒక వికెట్ తీశారు. అంతకుముందు విరాట్ కోహ్లి(135) శతకంతో.. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ 349/8 స్కోర్ చేసింది.

High Viewed News

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.