ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.