హాంకాంగ్‌లోని తై పొ (Tai Po) ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పలు హైరిస్ నివాస భవనాలను మంటలు చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి ఫైర్ సర్వీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, ఈ భవనాల్లో ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నారు. సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసి, సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.