Skip to main content

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది.

శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం కానీ, ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు. ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని, ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు.

అయితే, శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పాత నేరానికి కొత్తగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీవోపీటీ అనుమతి ఇవ్వడం చెల్లదని వాదించారు. దాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం కూడా సరైంది కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

High Viewed News

లక్ష్మీపురం లో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటల నుండి టిడిపి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కావున కూటమి నేతలు, పలాస నియోజకవర్గం ప్రజలు గమనించగలరని టిడిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తవూరులో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

పలాసలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

ఈనెల 25వ తేదీ నుంచి పలాస రైల్వే గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెటర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ATBPL ఒక ప్రాంతంలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనే జట్టులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు www.atbpl.in లేదా 7901233535 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

  ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM       CBN * TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు * AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్ * TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు * TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్కు తప్పుడు కేసులో నోటీసులు: KTR * BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక * భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు