బెంగళూరులో ఓ భర్త ఎవరూ ఊహించని విధంగా తన భార్యను చంపాడు. పాదరసం ఇంజెక్ట్ చేసి.. 9 నెలలు నరకం చూపించాడు. దీని కారణంగా ఈ తొమ్మిది నెలల కాలంలో ఆమెలోని ఒక్కో అవయవం పాడవుతూ వచ్చింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే చనిపోవడానికి ముందే తన భర్త తనకు చేసిన అన్యాయం గురించి వివరించింది. అలాగే తన భర్తకు పాదరసం, సిరంజిలు, క్లోరోఫామ్‌ను ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అందించారని పేర్కొంది. విద్య ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా భర్త బసవరాజు పై కేసు నమోదు చేశారు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.