శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటన స్థలంలో మృతి చెందగా... మరో యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కాశిబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.