2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.