హైదరాబాద్ : గంజాయి సరఫరా చేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్‌ను ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన గాదె అజయ్ (21) గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇంటింటికీ వెళ్లి గ్యాస్ సిలిండర్లు వేయడం ద్వారా వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి సరఫరా చేయడాన్ని ప్రారంభించాడు. గంజాయి తాగేవారు ఆర్డర్ చేస్తే అజయ్ నేరుగా వారి ఇంటికెళ్లి అందజేస్తున్నాడు.
ఈ క్రమంలో కూకట్‌పల్లి ఇస్తావా హోమ్స్ ప్రాంతంలో గంజాయి అమ్మకం జరుగుతుందన్న పక్కా సమాచారం అందడంతో నిఘా పెట్టిన ఎస్‌టీఎఫ్ సిబ్బంది గంజాయి విక్రయిస్తున్న అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద ఉన్న 580 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని కూకట్‌పల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.