శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండల పరిధిలో మంగళవారం పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి అభి యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడం శుభదాయకమని కొనియాడారు. అనంతరం పరిశ్రమంలో యంత్రాల పనితీరును ఆమె స్వయంగా పరివేక్షించారు. రాబోయే రోజుల్లో వ్యాపార అభివృద్ధి మరింత వ్యాప్తి చెంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.