వైకుంఠ ఏకాదశి దర్శనాలకు నవంబర్ 27 నుంచి టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2న లక్కీడిప్ ద్వారా మొదటి మూడు రోజులకు టికెట్లు కేటాయించబడతాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.