శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న మందస, వజ్రపుకొత్తూరు, పలాస రూరల్ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే వద్ద విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ... మరికొన్ని సమస్యలపై అక్కడికక్కడే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.