శ్రీకాకుళం జిల్లా నందిగాం (M) లట్టిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బొమ్మాళి సుదర్శన్ తన కుమార్తెతో కలిసి హరిదాసుపురం వెళ్లేందుకు లట్టిగాం వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా... పలాస నుంచి కోటబొమ్మాలి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుదర్శన్ కు తీవ్ర గాయాలు కాగా... ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా... ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుదర్శన్ ను శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.