శ్రీకాకుళం జిల్లా మందస మండలం నర్శింగుపురం, జిల్లుండా గ్రామ సచివాలయాలను స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించి, సిబ్బందిని సమయాపాలన పాటించాలని తెలిపారు. వివిధ సమస్యలపై సచివాలయం కు వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉంటూ... ప్రజల యొక్క వినతులను స్వీకరించి సకాలంలో వారి సమస్యలను పూర్తిచేయాలని ఆమె తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.