గుంటూరు నగరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిపై పట్టాభిపురం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
వివరాల ప్రకారం, అచ్చంపేట మండలం క్రోసూరుకు చెందిన బాలిక గుంటూరు నగరంలో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన తిరుపతయ్య అనే యువకుడు ఆమెను నమ్మబలికించి లాడ్జికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భవతైనట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారితమైంది.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలికకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.