Skip to main content

వాడివేడిగా మాక్ అసెంబ్లీ.. వారిని మార్షల్స్ ఎత్తి బైటేశారు!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మాక్‌ సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్‌, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు.

డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, అసెంబ్లీ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు.

విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న తన ఆలోచనని మంత్రి లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. దాంతో వివిధ స్థాయిలలో విద్యార్థులకు పలురకాల పోటీలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మాక్ అసెంబ్లీ లో వాడి వేడిగా చర్చ జరిగింది. ఒలింపిక్స్ చర్చపై అధికార మరియు ప్రతిపక్ష వర్గాల మధ్య డిబేట్ జరిగింది. ఒక దశలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. కొందరిని మార్షల్స్ ఎత్తుకొని బయట వేశారు. అసెంబ్లీని పోలినట్టు వేసిన సెట్ లో ఈ కార్యక్రమం అంతా జరిగింది.

కొంతమంది ప్రజా ప్రతినిధులు గౌరవ సభల్లో ప్రవర్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్టు చూపించిన చిన్నారులు. ఇది చూసి అయినా వాళ్ళు కళ్ళు తెరిచి సభా మర్యాదలు పాటిస్తారేమో చూడాలి.

High Viewed News

జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్.  జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.

పలాసలో కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి వేసిన వడ్డీ వ్యాపారి

శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో పలువురు వ్యాపారులుకు కుచ్చుటోపి వేసి కోట్లాది రూపాయలుతో ఉడాయించిన ఓ ప్రైవేట్ సంస్థ యాజమాని. ఇటీవల కాలంలో పలాసకు చెందిన సంస్థ యాజమాని గుండె పోటుతో మృతి చెందగా... ఆయన బిజినెస్ పార్ట్నర్ ఉడాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలో అధిక వడ్డీలకు ఆశబడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని పూర్తి వివరాలతో మళ్లీ మీ ముందుకు LMR NEWS NETWORK లో....

జాతీయ రహదారిపై అర్థరాత్రి దాటిన వేళ (BT)దోపిడి..!

శ్రీకాకుళం... పలాస టోల్గేట్ పరిధిలో అర్థరాత్రి దాటాక జరుగుతున్న అక్రమాలు నందిగాం, టెక్కలి, కోటబొమ్మాలి మండలాల పరిధిలో జాతీయ రహదారిపై నిల్వ ఉంచిన (BT) అక్రమంగా తరలిపోతున్న వైనం... జెసిబిలు సహాయంతో ట్రాక్టర్ల పై తరలిస్తున్న వైనం... ఈ అక్రమ తరలింపుకు గురైన(BT)పై వస్తున్న సొమ్ము ఎవరి జోబిలోకి వెళ్తుందో..!    ----- మరిన్ని పూర్తి వివరాలతో

పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాడుదాం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మీడియా సాక్షిగా కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రకటించి, నేడు అసెంబ్లీలో ప్రకటించిన జిల్లాల్లో పలాస పేరు లేకపోవడం చాలా బాధాకరమని పలాసకు చెందిన దువ్వాడ శ్రీధర్ (బాబా) మీడియాతో తెలిపారు. భౌగోళికంగా పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.   ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి ప్రాంతాలకు అందుబాటులో ఉన్నటువంటి పలాసను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధిలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను విభజించి, పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరారు. పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు శాంతియుతంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు.

ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలానికి పూర్తయిన అంత్యక్రియలు

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామ సమీప సముద్ర తీరానికి భారీ తిమింగళం శుక్రవారం ఉదయం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే... గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తిమింగళం కు పోస్టుమార్టం నిర్వహించి సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఆరున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో సుమారు రెండు టన్నుల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. సముద్రం లోపల ప్రయాణించే భారీ పడవలు, వాడలు తగలడంతో ఇలా మృత్యువాత పడతాయని ఆయన తెలిపారు.