శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు బిడ్జ్ సమీపంలో ఈనెల 8వ తేదీన ఒడిస్సా కు చెందిన లొట్ల లక్ష్మయ్య వద్ద రూ. 10 లక్షలు అసలు నోట్లు తీసుకొని రూ. 50 లక్షలు బ్లాక్ మనీ ఇస్తున్నట్లు చెప్పి పుస్తకాలతో ఉన్న సంచి ఇచ్చి కారులో పరారైన విషయం తెలిసిందే... ఈ కేసులో పలాస కు చెందిన సునీల్ అనే యువకుడును ఆదివారం సాయంత్రం అమరావతి హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న రూ. 4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కాశిబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.