శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.