శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహేంద్ర తనయ ఆప్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో సుమారు రూ. 7.61 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలలో మౌలిక వసతులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్ ఆర్ కాలనీలలో మౌలిక వసతులపై దృష్టి సారించామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.