పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో ఉన్న నెహ్రూ పార్క్ (ముత్యాలమ్మ కోనేరు) అభివృద్ధి పనులను గురువారం ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జంట పట్టణాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక నెహ్రూ పార్కును కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే కోనేరుకు నాలుగు వైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, టిడిపి నేతలు గాలి కృష్ణారావు, డొక్కరి శంకర్, సప్ప నవీన్, యవ్వారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.