44 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు ప్రాజెక్టులు. అమరావతిలో లోక్‍భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీసు, గెస్ట్ హౌస్‍లు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం. రూ.532 కోట్లతో సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధాన పనులకు ఆమోదం. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‍లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.