శ్రీకాకుళం జిల్లా పలాస(M) తర్లాకోట పంచాయితీ పరిధి గట్టూరు సమీప పొలంలో శనివారం మధ్యాహ్నం వరికుప్ప అగ్నికి ఆహుతి అయ్యింది. పొత్రియ గ్రామానికి రైతు సవర సుంకయ్య సుమారు ఎకరా పొలంలో కోతలు అనంతరం కుప్పగా వేశారు. శనివారం ఒక్కసారిగా మంటలను గమనించిన సమీప పొలాల్లో ఉన్న రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అప్పు చేసి పొలంలో వ్యవసాయ పెట్టుబడి పెట్టానని ప్రభుత్వం తనను ఆదుకోవాలని సుంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.