Skip to main content

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

*ఢిల్లీ- ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు నలుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు. 

* TG: HYDలోని రవీంద్రభారతిలో SPB విగ్రహావిష్కరణ

* ముగిసిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం

* AP: ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు మరణించిన రోజు: CBN

* కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జగన్

* క్రికెటర్ షెఫాలీ వర్మకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

* రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన

* ఢిల్లీలో ముగిసిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

* పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్కు సగం సీట్లు కూడా రాలేదన్న కేటీఆర్

* కాంగ్రెస్, సోనియా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్.. ఓట్ చోరీ ర్యాలీలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం

* భారీగా పెరిగిన బంగారం ధరలు

* ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. 90.75కు పతనం

* ప్రధాని మోదీతో మెస్సీ మీటింగ్ క్యాన్సిల్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.

* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.

* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

* మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్లు, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కేటాయిస్తూ క్రీడా శాఖ స్పెషల్ CS అజయ్ జైన్ ఉత్తర్వులు

* నేడు TTD ధర్మకర్తల మండలి సమావేశం

* ఇంద్రకీలాద్రి: 5 రోజుల్లో దీక్షలు విరమించిన 5.77 లక్షల మంది భవానీలు

* ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి CM CBN

* లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు చెవిరెడ్డి.. విచారణ 22వ తేదీకి వాయిదా

* పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

* మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహాకుట్ర: CBN

* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: జగన్

* TG: యూరియా బుకింగ్ కోసం యాప్: మంత్రి తుమ్మల

* ఇండియాలో ముగిసిన GOAT మెస్సీ పర్యటన


 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం

* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం

* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం

* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు

* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ విజయం)

High Viewed News

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.