శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉపాధి నిమిత్తం కాంతారావు తన కుటుంబంతోపాటు విశాఖలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తన భార్య సంధ్య (37), కుమార్తె మహేశ్వరి (9) తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. సింహాచలం గోశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంతారావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన తల్లి కూతురును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్న గుర్నాథ్ (11) అనాది అయ్యాడు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?