శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. తోటి మత్స్యకారులుతో కలిసి వేట సాగిస్తుండగా... ప్రమాదవశాత్తు మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) పట్టు తప్పి సముద్రంలో పడిపోయాడు... ఇదే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ అతను తగలడంతో తీవ్ర గాయాలతో విశ్వనాథం మృతి చెందాడు. తోటి మత్స్యకారులు ఆయన మృతదేహాన్ని అతి కష్టంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు సముద్ర తీరానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. విశ్వనాథం మృతదేహాన్ని చూసేందుకు సమీప ప్రాంత ప్రజలు వందలాదిమందిగా తీరానికి చేరుకున్నారు. మృతునికి భార్య ఈశ్వరితో పాటు 6, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.